Header Banner

వైజాగ్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు లెవెల్ అప్! ACA అధ్యక్షుడు కీలక సమీక్ష!

  Tue Mar 04, 2025 16:51        Sports

ఐపీఎల్ మ్యాచుల‌కు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్దం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప‌రిశీలించిన ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : రాబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల‌కు ముందు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రధాన నవీకరణలను ప్రకటించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషంగా ఉందని ఎసిఏ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. .

వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ ( ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్/విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ) స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించడానికి స్టేడియంను సందర్శించారు. ఈ మేర‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!

ఈనెల 24, 30వ తేదీల్లో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనున్నందున మిగిలిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారు ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రౌండ్ లో ఏర్పాట్లు అధునాతన ఫ్లడ్‌లైట్లు, అంతర్జాతీయ ప్రమాణాల కార్పొరేట్ బాక్స్‌లు స్టేడియం మౌలిక సదుపాయాల పూర్తి పునర్నిర్మాణం జ‌రిపిన‌ట్లు ఎసిఏ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ ధృవీకరించార‌ని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోయే స‌మయాన్ని ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ కార్పొరేట్ స్టైల్ లో స‌రికొత్త రూపులో క్రికెట్ అభిమానుల‌కు క‌నిపిస్తుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


"రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అభిమానులతో పాటు క్రికెట్ జట్లకు మెరుగైన, ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏ.సి.ఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్ , కోశాధికారి దండుమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్ ల‌తో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cricket #stadium #international #todaynews #vizag #flashnews #latestnews